
వీటి పంపకాలకు సంబంధించి క్లియర్‌కట్‌గా వీలునామా రాసినట్లు తెలుస్తోంది. వాటిలో సుమారు 3,800 కోట్ల సంపదను.. తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్‌కు కేటాయించారు. తన సవతి సోదరీమణులైన శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ పేరుపై 800 కోట్లు రాసినట్లు తెలుస్తోంది. ఆయా కేటాయింపుల్లో ఫిక్డ్స్ డిపాజిట్లు, ఖరీదైన పెయింటింగ్స్, వాచ్‌లు వంటివి ఉన్నాయి. రతన్ టాటాకు సన్నిహితుడైన.. మోహిన్ ఎం దత్తాకు కూడా 800 కోట్లు రాయడం మరోసారి ఆసక్తిగా మారింది. తన సోదరుడు జిమ్నీ నావల్ టాటాకు.. రతన్ టాటాకు చెందిన జుహూలోని బంగ్లాలో కొంత షేర్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కేటాయించారు. మెహిల్ మిస్త్రీ పేరుపై అలీబాగ్‌లోని బంగ్లా, మూడు పిస్టోళ్లను కేటాయించారు. కుక్కలంటే చాలా ఇష్టంగా ప్రేమించే రతన్ టాటా.. శునకాల సంరక్షణ కోసం కూడా 12 లక్షల ఫండ్ కేటాయించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి 30వేలు చొప్పున వాటికి ఖర్చుచేసేలా నిధులను కేటాయించారు. రతన్ టాటాకు విదేశాల్లో కూడా 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రముఖ కంపెనీల్లో షేర్స్, ఖరీదైన 65 వాచీలు కూడా ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరెంట్ తీగలపై మేక విన్యాసాలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు
సెలవులకు తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. మీకో గుడ్‌న్యూస్
దొంగతనంలో వీరి నైపుణ్యం వేరప్పా.. చక్కగా వచ్చారు.. చటుక్కున్న కొట్టేసారు
మీ పిల్లలకు ఐస్‌క్రీమ్ కొనిస్తున్నారా? ఈ భయంకర వ్యాధులు తప్పవు!
వైట్ రైస్‌కి బదులుగా ఓట్స్ తింటున్నారా ?? జరిగేది ఇదే..