
పల్లీలలో ప్రోటీన్, మంచి కొవ్వులు, విటమిన్ లాంటి పదార్థాల ఉండడం వల్ల శరీరానికి శక్తినిస్తాయి. అయితే చర్మ సమస్యలు ముఖ్యంగా మొటిమలు ఉన్నవారికి ఇవి ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. ఎందుకంటే పల్లీల్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో దాహాన్ని పెంచే లక్షణాలు కలిగి ఉంటాయి. దీంతో చర్మం మీద మంట, వాపు, మొటిమల రూపంలో ప్రతికూలతలు కనిపించవచ్చు.
పల్లీలు తినడం వల్ల శరీరంలోని తైల గ్రంథులు ఎక్కువగా పనిచేయడం ప్రారంభించవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖం మీద నూనెగా మారి రోమరంధ్రాలు మూసుకుపోయే అవకాశముంటుంది. దీని ఫలితంగా మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ రావచ్చు. అంతేకాక చర్మం అసహజంగా మారుతుంది.
నట్స్ అన్నీ చర్మానికి హానికరమని కాదు. కానీ ఏదైనా పదార్థం ఎక్కువగా తీసుకుంటే ఆహార అసమతుల్యత ఏర్పడుతుంది. మొటిమలున్న వారు పల్లీలతో పాటు ఆల్మండ్స్, వాల్నట్స్ వంటివి కూడా మితంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరి చర్మం ఒక్కోలా స్పందిస్తుందని గుర్తించాలి. అందుకే మితమైతే మంచిదని నిపుణుల అభిప్రాయం.
చర్మ ఆరోగ్యానికి మంచి ఆహార అలవాట్లు అవసరం. తైలం, ఫ్రైడ్ ఫుడ్స్, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న స్వీట్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంచే కూరగాయలు, పండ్లు తినడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు ఎక్కువ నీళ్లు తాగడం వల్ల చర్మం తేమగా, హైడ్రేట్ గా ఉంటుంది.
ప్రతి ఒక్కరు తినే ఆహారం పట్ల చర్మం ఎలా స్పందిస్తోంది అనే విషయం గమనించాలి. కొంతమందికి పల్లీలు తింటే ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. మరికొందరికి చిన్న పరిమాణంలో తిన్నా మొటిమలు రావచ్చు. కాబట్టి మీ శరీరం చెప్పే సంకేతాలను అర్థం చేసుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)