
భాగ్యనగరంలో పరిస్థితి ఎలా ఉంది ? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..పెళ్లై చాలా కాలం అయినా దంపతులకు పిల్లలు కాలేదు అంటే అంతా స్త్రీ వైపే వెలెత్తి చూపే సమాజం మనది. కానీ కొన్నాళ్లుగా ఈ పరిస్థితి మారుతోంది. సంతానం కలగకపోవడానికి కారణం మగాళ్లు కూడా కావచ్చన్న అవగాహన పెరుగుతోంది. మరోవైపు మెట్రోపాలిటిన్ నగరాల్లో పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోందన్న కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాంపత్య జీవితంతో ఒక్కటైన కొత్త జంటలు తల్లిదండ్రులు కావాలని ఎన్నో కలలు కంటారు. దానికి అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. తీరా చూస్తే పిల్లల కోసం చేసే ప్రయత్నాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు సంతానం ఆలస్యమవుతోందనగానే స్త్రీల సమస్యగానే పరిగణిస్తున్నారు. అయితే దేశంలో దాదాపు 50 శాతం నుంచి 60 శాతం మంది మగవారిని ఇన్ఫెర్టిలిటీ సమస్య వేధిస్తోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం