
బొలీవియా తెగల నుంచి దీవిని 25 ఏళ్లకు లీజుకు ఒప్పందం చేసుకుని, వెయ్యేళ్ల లీజు అని చెప్పుకున్నారు కైలాస ప్రతినిధులు. ఈ భూమి విస్తీర్ణం ఢిల్లీ నగరం కన్నా మూడురెట్లు ఎక్కువ. ఈ భూమి కోసం నిత్యానంద బ్యాచ్ భారీ స్కెచ్ గీసిందని న్యూయార్క్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. గత ఏడాది బొలీవియాలో కార్చిచ్చును నియంత్రించడంలో నిత్యానంద బ్యాచ్ కొంత సాయపడింది. బొలీవియాకు సాయం చేసేందుకు ఏటా రెండు లక్షల డాలర్లు ఇస్తామని ఆఫర్ చేశారు. వాస్తవానికి అక్కడ మైనింగ్‌పై నిత్యానంద అనుచరులు కన్నేసినట్టు తెలుస్తోంది. తొలుత ఈ స్కామ్‌ను స్థానిక మీడియా బట్టబయలు చేసింది. కైలాస ప్రతినిధులు తమను మోసం చేశారని బొలీవియా తెగలు ఆరోపించాయి. ఈ వ్యవహారాన్ని భూకబ్జాగా పరిగణించింది బొలీవియా ప్రభుత్వం. గతవారం 20 మంది నిత్యానంద అనుచరులను అరెస్ట్ చేశారు. నిత్యానంద స్కామ్‌పై పూర్తిస్థాయిలో న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించడంతో ప్రపంచానికి తెలిసింది.
మరిన్ని వీడియోల కోసం
సింహంతో బాలుడి పరాచకాలు.. వీడియో
భూదేవి చెప్పిందంటూ.. సజీవ సమాధికి యత్నించిన వ్యక్తి చివరికి వీడియో
పర్యాటకులకు కనిపించిన అద్భుతం.. పులి ఏం చేసిందంటే?
కుంభమేళా మోనాలిసాకు షాక్..డైరెక్టర్ అరెస్ట్ తో అయోయమంలో బ్యూటీ