పెళ్లి పీటల మీదే వివాహం ఆగిపోయిన ఘటన తాడేపల్లిలో జరిగింది. పెళ్లి కొడుకుకు HIV ఉన్నట్లు తెలియడంతో అక్కడికక్కడే పెళ్లి ఆపేశారు. వరుడికి HIV ఉన్నట్లు చర్చి పాస్టర్కు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మహిళా ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. దీంతో తాళి కట్టే సమయానికి అక్కడికక్కడే పెళ్లిని ఆపించేశారు చర్చి పాస్టర్. – అనారోగ్యంతో ఉన్నవ్యక్తితో వివాహం జరిపించలేమని పాస్టర్ తేల్చి చెప్పారు. అయితే మహిళా ప్రతినిధులు, పెళ్లికూతురు బంధువులపై వరుడి బంధువులు గొడవకు దిగారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులకు చర్చి పెద్దలు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలకు సర్థిచెప్పి పంపించేశారు. అయితే అబ్బాయి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నారు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ప్రతినిధులు.
మరిన్ని వీడియోల కోసం :
పంటి నొప్పితో ఆస్పత్రికొచ్చి ప్రాణాలు కోల్పోయింది.. డాక్టర్లు CT స్కాన్ చేయగా
మస్క్ కాళ్లను ట్రంప్ పట్టుకున్నట్టుగా వీడియో.. అమెరికా ప్రభుత్వ కార్యాలయంలో టెలికాస్ట్.. చివరకు..
అయ్యో.. ఆ బంగారు టాయిలెట్‌ను దొంగలు దోచుకెళ్లారు!వీడియో
