
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడితో దేశం ఒక్కసారిగా ఉల్కిపడింది. ఈ దాడిలో 30 మంది మరణించాగా సుమారు 16 మంది గాయపడినట్లు సమాచారం. ఈ దాడిలో ఉగ్రవాదులు పురుషులపై మాత్రమే దాడి చేశారు. ఉగ్రవాద దాడుల బాధితుల్లో ఎక్కువ మంది పర్యాటకులే. మృతుల్లో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ముగ్గురు ఉండగా.. గుజరాత్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులతో పాటు పహల్గామ్కు చెందిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కూడా ఉన్నారు. అయితే ఈ ఉగ్రవాద దాడిలో మహారాష్ట్రకు చెందిన ఐదుగురు మరణించారు. హేమంత్ సుహాస్ జోషి, సంజయ్ లక్ష్మణ్ లాలీ ముంబై నివాసితులు. అతుల్ శ్రీకాంత్ మోని, సంతోష్ జగ్దా, కస్తూబా గాంవోటే కూడా మహారాష్ట్ర వాసులు. ఇండోర్‌కు చెందిన సుశీల్ నథానియల్ కూడా ఉగ్రవాద దాడిలో మరణించాడు. అతను తన భార్య పుట్టిన రోజు జరపడానికి కాశ్మీర్ వెళ్ళాడు. సుశీల్ LIC బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసేవాడు.
ఉగ్రవాద దాడిలో మరణించిన వ్యక్తుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. ఒకరు విశాఖ వాసి రిటైర్డ్ ఉద్యోగ చంద్ర మౌళికాగా మరొకరు నెల్లూరుకి చెందిన మధుసూదన్‌లు.. కాగా హైదరాబాద్ లోని స్టేట్ బ్యాంక్ లో పని చేస్తున్న మనీష్ రంజన్ కూడా ఉగ్ర తూటాలకు బలి అయ్యారు. బీహార్ కి చెందిన మనీశ్‌రంజన్ కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) ఆఫీస్ లో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఆయన్ని భార్య, ఇద్దరు పిల్లల ముందే ఉగ్రవాదులు కాల్చిచంపినట్లుగా తెలుస్తోంది. మనీష్ ఐడీ కార్డు చూసి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని భార్య పిల్లలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
గుజరాత్ కి చెందిన తండ్రి, కొడుకు మృతి
గుజరాత్‌కు చెందిన ముగ్గురు మరణించారు. ఇందులో తండ్రీ కొడుకులు కూడా ఉన్నారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ నివాసితులు అయిన యతేష్ పర్మార్ , అతని కుమారుడు సుమిత్ పర్మార్ మరణించారు. వీరితో పాటు సూరత్‌కు చెందిన శైలేష్‌భాయ్ హిమ్మత్‌భాయ్ కలాథియా కూడా హత్యకు గురయ్యాడు.
ఉగ్రదాడిలో గాయపడిన వారి లిస్టు

Pahalgam Attack Injured Persons List
ఉగ్రదాడిలో పహల్గామ్కు చెందిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కూడా ఉన్నాడు. నేపాల్‌కు చెందిన సుదీప్ న్యూపానే కూడా ఉగ్రవాదుల చేతిలో మరణించాడు. మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఒడిశా, కేరళ, చండీగఢ్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్‌లకు చెందిన వారు కూడా ఉగ్రవాద దాడిలో మరణించారు. పహల్గామ్లో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. వారు మహిళలపై కాల్పులు జరపలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..