
అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టిన ఒక వ్యాపారి తాటికాయలన్నింటిని బాగా కడిగి బండి పై పెడుతున్నాడు. ఏం మంచిరా వాటర్ తోనో కడుగుతున్నాడు అనుకుంటే పొరపాటు. రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ నీటితో శుభ్రంగా కడిగి బండి మీద పెడుతున్నాడు. ఈ సీన్ మొత్తం చూసిన స్థానికులు కొందరు తమ మొబైల్స్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.