
బాహుబలి నుంచి తన హీరోల లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు రాజమౌళి. బాహుబలిలో రెండు క్యారెక్టర్స్ చేసిన ప్రభాస్, రెండు లుక్స్ పూర్తి డిఫరెంట్‌గా ఉండేలా చూసుకున్నారు. బాహుబలిగా భారీ ఫిజిక్‌తో కనిపించారు. తరువాత శివుడి పాత్రలో కాస్త లీన్‌గా కండలు తిరిగిన దేహంతో కనిపించారు. ఈ లుక్స్ అచ్చీవ్ చేయడానికి చాలా కష్టపడ్డారు డార్లింగ్.
ఇక ట్రిపులార్ హీరోల కష్టాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఇంట్రో సీన్ కోసం స్పెషల్‌గా వర్కవుట్ చేయాల్సి వచ్చింది తారక్. ఓ గిరిజనుడిలా కనిపించేందుకు స్ట్రాంగ్ బాడీని బిల్డ్ చేశారు జూనియర్.
ఫస్ట్ టీజర్లో రామ్ చరణ్ లుక్ చూస్తే ఏ స్థాయిలో వర్కవుట్ చేసి ఉంటారో అర్థమవుతుంది. లుక్స్, డ్యాన్స్ మూమెంట్స్, స్టంట్స్ ఇలా ప్రతీ విషయంలోనూ హీరోలకు చుక్కలు చూపించారు రాజమౌళి.
మహేష్ విషయంలో మాత్రం జక్కన్న కాస్త కాంప్రమైజ్ అవుతున్నారన్నది ఫ్యాన్స్ సైడ్ నుంచి వినిపిస్తున్న మాట. జక్కన్న అనుకున్న కథకు మహేష్ రెగ్యులర్ ఫిజిక్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది.
అందుకే పెద్దగా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లేకుండానే సినిమాను పట్టాలెక్కించారు. కాస్త లాంగ్ హెయిర్ మెయిన్టైన్ చేయటం తప్ప పెద్దగా మేకోవర్ టార్గెట్ ఏం లేకుండానే మహేష్‌తో మూవీ చేస్తున్నారు రాజమౌళి.
మేకోవర్ విషయంలో లైట్ తీసుకున్నా.. మేకింగ్ విషయంలో మాత్రం జక్కన్న కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటున్నారు క్రిటిక్స్. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ డ్రామా అంటే స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు అదే స్థాయిలో ఉంటాయి. అందుకే మేకోవర్ విషయంలో రిలాక్స్ అయినా షూటింగ్ విషయంలో మహేష్‌కు కూడా కష్టాలు తప్పవంటున్నారు ఇండస్ట్రీ జనాలు.